ఏపిలో దిశ యాప్ తొలి సక్సెస్

ఆనందంతో చప్పట్లు కొట్టిన సిఎం జగన్

AP DGP-CM JAGAN
AP DGP-CM JAGAN

అమరావతి: ఇటివల ఏపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దిశా యాప్ ద్వారా తొలి సక్సెస్ నమోదయింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ మహిళకు బస్సులు వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె వెంటనే స్పందించి దిశ యాప్ ద్వారా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో SOS కి ఫోన్ కాల్ వచ్చిన 6 నిమిషాల్లోనే ఆకతాయిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు.మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై ఏపీడీజీపీ గౌతామ్ సవాంగ్ ఓ సమావేశంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి వివరించారు. దీంతో అది విన్న జగన్ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అనంతరం పోలీసులను అభినందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొగ్రామ్స్ సమర్థవంతంగా జరుగుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. సదరు మహిళ SOS బటన్ నొక్కిన వెంటనే ఏడు నిమిషాల్లోనే వారికి సహాయ సహకారాలు అందించడం ఘటనా స్థలానికి టీం చేరుకోవడం నిజంగా గ్రేట్ అన్నారు. పోలీసు డిపార్ట్ మెంట్ అందరికీ అభినందనలు తెలియజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/