నిధుల కొరతతోనే వికేంద్రీకరణ నిర్ణయం

ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమధానం చెప్పే బాధ్యత నాపై ఉంది

ys jagan mohan reddy
ys jagan mohan reddy

విజయవాడ: ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి . విజయవాడలో జరిగిన ది హిందూ ఎక్స్ లెన్స్ ఇన్ ఎడ్యూకేషన్గ కార్యక్రమానికి జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. నిధుల కొరతతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షా 9 వేల కోట్లు అవసరమన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీ అని, అమరావతికి ఖర్చు చేసే నిధుల్లో కేవలం 10 శాతం ఖర్చు చేస్తే సరిపోతుందన్నారు. లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్న జగన్.. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/