కేంద్రమంత్రితో సిఎం జగన్‌ భేటి

పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం

Ravi Shankar Prasad
Ravi Shankar Prasad

న్యూఢిల్లీ: సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. నిన్నసాయంత్రం ఢిల్లీ చేరుకున్న జగన్‌ రాత్రి 9.45 గంట సమయంలో అమిత్‌షాతో భేటీ అయి పు అంశాలపై చర్చించారు. ఈరోజు రవిశంకర్‌తో సమావేశమై హైకోర్టు తరలింపు, శాసన మండలి రద్దు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్‌లు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/