‘అన్న,తమ్ముళ్లకు, అక్కచెల్లెమ్మలకు గర్వంగా చెబుతున్నా’

‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ మూడో విడత ప్రారంభంలో సీఎం జగన్

YouTube video
Hon’ble CM of AP will Disbursing Financial Assistance Through YSR Vahana Mithra at Camp Office LIVE

Amaravati: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు మంచి చేయాలని తాపత్రయపడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని , వారి గురించి ఏపీ ఒక్కటేనని ప్రతి అన్నకు, అక్కకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి, చెల్లికి అన్నగా గర్వంగా తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరుసగా మూడో ఏడాది ‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ పథకం అమలుకు సీఎం వైయస్‌ జగన్‌ నేడు శ్రీకారం చుట్టారు. 2,48,468 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్నామని, ఇందుకు రూ.248.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.

వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు.‘ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లుగా ప్రతి రోజూ సేవలు అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలు అందరికీ కూడా కృతజ్ఞతలు అని తెలిపారు. 3,648 కిలోమీటర్ల తన పాదయాత్రలో ఏలూరు సభలో 2018 మే 14న జరిగిన సభలో ఒక మాటిచ్చానని, ఆ రోజున గత ప్రభుత్వంలో పెనాల్టీలు ఎక్కువయ్యాయి.. రోజుకు రూ.50 పెనాల్టీ వేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ కట్టాలంటే సుమారు రూ.7500 అవుతుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రావాలంటే రిపేర్లు చేయించాలి. అన్నీ కలిపి దాదాపు 10 వేలు ఖర్చు అవుతుంది. అంత మొత్తం కట్టాలంటే అప్పు తేవడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు నాతో చెప్పారాని ఆయన వెల్లడించారు. . ఆ రోజున ఏలూరు సభలో మాటిచ్చిన తరువాత వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ వాహన మిత్ర సాయాన్ని లబ్ధిదారుల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరుగుతుందన్నారు.

ఈ ఏడాది 2,48,468 మంది అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలకు రూ.248.47 కోట్లు సాయంగా ఈ రోజు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందాని పేర్కొన్నారు. . దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం ఒక్క వాహన మిత్ర పథకం కింద రూ.759 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేయడం జరిగిందని వెల్లడించారు. . దాదాపు ఒక్కొక్కరికి రూ.30 వేలు సాయం అందినట్టు అవుతుందని, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధిపొందిన వారిలో అర్హులందరితో పాటు గతేడాది కాలంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ముళ్లకు, అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు జమ చేయడం జరుగు తుందని ఆన్నారు.

‘రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్ల గురించి ఆలోచన చేసి.. మంచి చేయాలనే ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని సగర్వంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా గర్వంగా తెలియజేస్తున్నా’ అని అన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/