దిశ చట్టంపై ఏపి సిఎం కీలక నిర్ణయాలు

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవలే దిశ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా దిశ యాక్ట్‌పై ఏపి సిఎం జగన్‌ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఛీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్నీ, డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ మరియు ఇతర ముఖ్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని జగన్‌ ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక స్పెషల్‌ కోర్టును వెంటనే ఏర్పాటు చేసి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారం, హత్యాచారం కేసులను ఆ కోర్టుల్లో విచారించి శిక్షలు విధించేలా చూడాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టానికి ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా కేంద్ర ఆమోదం తెలిపేలోగా పెండింగ్‌ కేసులని పరిష్కరించాలని జగన్‌ సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/