సిఎం జగన్‌లో ట్రెనీ ఐఏఎస్‌ల భేటి

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌తో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సోమవారం క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యారు. ముస్సోరీలో రెండో విడత శిక్షణ కరోనా కారణంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు వివిధ శాఖలను కేటాయించారు. ఆయా శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు ఈ కాలాన్ని ట్రైనీ ఐఏఎస్‌లు వినియోగించుకున్నారు. ఆ శాఖలపై ప్రజంటేషన్లు తయారు చేశారు. కొన్ని ఎంపిక చేసిన వాటిపై ట్రైనీ ఐఏఎస్‌లు సిఎంకు ప్రజెంటేషన్‌ అందజేశారు. ప్రజంటేషన్లు ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లు కేటన్‌ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సిఎం అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ, కేటాయించిన శాఖల్లో అవగాహన పెంచుకోవాలి. అనుభవం సంపాదించాలి. ప్రతి వ్యవస్థల్లో లోపాలు కనిపిస్తుంటాయి, వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగులు వేసి వాటిని దృఢంగా తీర్చిద్దాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు, వారి మార్గ నిర్దేశంలో పనిచేయాలి అని అన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/