గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్
ఢిల్లీలో రెండ్రోజులు పర్యటించిన సీఎం జగన్
ap-cm-jagan-delhi-tour-ends
అమరావతి: ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, షెకావత్, జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లను కలిశారు. వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/