జగన్‌కు సచివాలయంలోఘన స్వాగతం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం.. ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ధర్మాన కృష్ణదాస్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/