ఇంటర్‌ విద్యార్థులకు సిఎం జగన్‌ శుభాకాంక్షలు

AP CM jagan
AP CM jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఇంటర్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఏపిలోని విద్యార్థులకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బెస్టాఫ్‌ లక్‌ మై యంగ్‌ ఫ్రెండ్స్‌. ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇన్నాళ్ల మీ కష్టం, సాధనకు తగిన ఫలితం రాబట్టే సమయం ఇదే. మీ లక్ష్యం దరికి తప్పక చేరుస్తుంది అంటూ ట్వీట్‌చేశారు. ఏపీలో ఈరోజు నుంచి జరగనున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,46,368 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులను నిర్వాహకులు పరీక్ష హాల్‌లోకి అనుమతించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/