రెడ్‌జోన్‌ పరిధిలో ఏపి సిఎం నివాసం

స్పందించిన కలెక్టర్‌ శామ్యుల్‌ ఆనంద్‌

samule anand kumar
samule anand kumar

గుంటూరు: రెడ్‌జోన్‌ లో ఏపి సిఎం జగన్‌ నివాసమున్నారన్న వార్తలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. తాడేపల్లిలో సిఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉండే మారుతి నివాసంలోని ఓ వృద్దురాలు అనారోగ్యంతో మృతిచెందారు. మృతిచెందిన అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతొ సిఎం నివాసం రెడ్‌జోన్‌ పరిధిలోకి వస్తుందంటూ పుకార్లు పుట్టాయి. దీంతో స్పందించిన గంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యుల్‌ ఆనంద్‌ ఏదైనా ఒక ప్రాంతం రెడ్‌జోన్‌ పరిధిలోకి రావాలంటే అక్కడ నాలుగు కరోనా పాజిటివ్‌కేసులు నమోదు కావాలని అన్నారు. కాని తాడేపల్లిలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయిందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/