అన్నిటా ఎపి నం. 1

AP CM BABU REVIEW
AP CM BABU REVIEW

అన్నిటా ఎపి నం. 1
పదేళ్లలో చేసి చూపిస్తాం: చంద్రబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాబోయే పదేళ్లల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తరువాత అనేక కష్టనష్టాలు, సవాళ్లను ఎదు ర్కొన్నామని, వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగుతున్నామని వివరించారు. రాష్ట్రం సాధించిన అనేకఅవార్డులే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఏపి రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ 2018కి గాను జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును గెలుచుకోవడం అభినంద నీయమన్నారు. వరుసగా నాలుగోసారి అవార్డు దక్కించుకున్నందుకు ఇంధన శాఖకు అభినం దనలు తెలిపారు. విద్యుత్‌ పొదుపుకు సంబం ధించి ఉత్తమ పనితీరుకు గాను ఏపిఎస్ప్‌డిసిఎల్‌ కూడా అవార్డు అందుకుందన్నారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ రంగం 139 అవా ర్డులు అందుకోవడం గర్వకారణమని, భవిష్యత్తు లోనూ ఇదేపంథాను కొనసాగించాలని సిఎం ఆకాంక్షించారు. ఇంధనశాఖ అధికారులతో ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పాలనకు సంబంధించి అనేక రంగాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటి, ఏపిసి ఆర్‌డిఏ, నీటిపారుదల, పరిశ్రమలు తదితర శాఖలు సులభతర వ్యాపార నిర్వహణ, స్కోచ్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌, జాతీయ ఈ గవర్నెన్స్‌, హడ్కో, ఐజిబిసి అవార్డులు అందుకున్నారు.
=====