వైకాపా ఓటమి చారిత్రక అవసరం

AP CM BABU
AP CM BABU

వైకాపా ఓటమి చారిత్రక అవసరం

కడప,µ: కాంగ్రెస్‌ మోసం చేసి రాష్ట్రాన్ని విభజిస్తే, బిజెపి రాష్ట్రా నికి నమ్మక ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. బిజెపితో పొత్తుపెట్టుకుంటే రాష్ట్రానికి మంచి జరుగు తుందనే నమ్మకంతోనే బిజెపితో పొత్తు పెట్టు కున్నానని చివరకు సామ, బేద, దండోపాయాలు ప్రయోజనం లేకపోవడంతో ఆ పార్టీతో తెగ తెంపులు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 5వ రోజు నవ నిర్మాణ దీక్షలో భాగంగా బుధవారం సాయంత్రం కడప మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన జ్ఞానభూమి – ఉపాధి కల్పన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి మోసపూరిత విధానం వల్లె తిరుగుబాటు బాట పట్టామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూస్తామనిచెప్పి నన్ను బలి చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంపై తానుచేస్తున్న పోరాటం ఆగదని ఇక ముందు కూడా కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. విభజన తరువాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాను ఇచ్చిన పిలుపుతోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి తెలుగు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. అవినీతి పరుడైన గాలి జనార్ధన్‌రెడ్డి డబ్బులతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని బిజెపి ప్రయత్నించగా కోర్టు జోక్యంతో జెడిఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కు తెప్పించి పేదల అకౌంట్‌లో 15 వేలు జమచేస్తామని చెప్పిన ప్రధాని మోడీ హామీ ఏమైం దని ప్రశ్నించారు.