ప్రకృతి సేద్యంలో నోబెల్‌ సాధించండి

Untitled-1 copy
AP CM BABU

ప్రకృతి సేద్యంలో నోబెల్‌ సాధించండి

విజేతకు రు.100కోట్ల బహుమతి
మీ స్ఫూర్తితో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించా
రైతు శిక్షణా కార్యక్రమంలో సిఎం చంద్రబాబు

అమరావతి: ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు సాధించి ప్రపంచంలోనే ఏపిని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పిలుపునిచ్చారు. నూతన ఆలోచనలతో ప్రకృతి సేద్యం చేపట్టి ప్రపంచానికి ఆరోగ్యవంతమైన పంట దిగుబడులు అందించడం ద్వారా ఈ రంగంలో మన రైతులు నోబెల్‌ బహుమతి సాధించాలని రైతుకు రు.100 కోట్లు బహుమతిగా అందజేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం రైతుల శిక్షణా కార్యక్రమంలో సిఎం పాల్గొని రైతులతో ముఖాముఖి చర్చలుజరిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయ రైతు శిక్షణా రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం సభికులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో మన రైతులు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఒకప్పుడు గ్రోమోర్‌ ఎరువులు వాడడం పట్ల రైతులు ఆసక్తి చూపేవారని, కానీ ప్రస్తుతం ఇక ప్రకృతి వ్యవసాయంతో గ్రోమోర్‌ ఇక నోమోర్‌ అన్నారు. ఒక విజయం ఇంకో విజయానికి సోపానంగా మారుతుందని అదే అపజయమైతే మనిషిని కుంగదీస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగానికి రాష్ట్రం నుండి అధికారులతో కలిసి ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు వెళ్ళి ఆ ప్రసంగంలో రాష్ట్రరైతులే నాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.

రైతులిచ్చిన స్ఫూర్తితో 2024 నాటికి జీరోబేస్డ్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌లో 100శాతం సాధించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్ది చరిత్రలో స్థానం లిఖిస్తామన్నారు. జెడిబిఎస్‌ఎఫ్‌పై రైతులకు నమ్మకం కుదిరిందా అని ముఖ్యమంత్రి రైతులను ప్రశ్నించగా నమ్మకం కుదిరిందని రైతులు ప్రత్యుత్తరమిచ్చారు. ఇక్కడ వున్నవారంతా జెడ్‌బిఎన్‌ఎఫ్‌ పంటలు పండించేవారే కావడంతో అంతా ఆరోగ్యంగా వున్నాన్నారు. జెడ్‌బిఎన్‌ఎఫ్‌ వల్ల ఖర్చు తక్కువ, రైతుకు ఆదాయం ఎక్కువ వస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఎంతో మంది చదువుకున్నవారు, రాజకీయనాయకులు ముందుకు రావడం మంచిపరిణామమమన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం ప్రశంసిస్తున్నారన్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను పుస్తక రూపంలో తీసుకొస్తే ఫలితాలతో పాటు వాస్తవమవుతుందని, అలాగే సర్టిఫికేషన్‌ కూడా అవసరమన్నారు. శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తలుగా రైతు దేవుళ్ళుగా ప్రకృతి వ్యవసాయం చేసే వారికి ప్రజలు కొలుస్తారని, దానికి రాష్ట్రంలో రైతులు శ్రీకారం చుట్టినందుకు అభినందిస్తున్నానన్నారు. అనాధిగా రాష్ట్రంలో రైతాంగం వినూత్న విధానాలకు, కొత్త పంటలు పండించడానికి ముందుకురావడం ఈ ప్రాంతంలో ఎప్పటినుండో వుందన్నారు. రైతులతో ఒక నెలలోనే 3-4 సార్లు ప్రకృతి వ్యవసాయంపై సమావేశాలు నిర్వహించిన స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితిలో ఒక భరోసాతను తాను ప్రసంగించానన్నారు. 20 సంవత్సరాల క్రితం టెక్నాలజీని మొదటిగా రాష్ట్రంలో నేనే ప్రమోట్‌ చేశానన్నారు. నూతన సాంకేతికతకు ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిందని, ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికైనా రియల్‌టైంలో వార్తలందించడంతోపాటు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయన్నారు.

దానిని ముందుగానే గమనించి టెక్నాలజీని ప్రమోట్‌ చేయడంతో తెలుగువారు ప్రపంచమంతా విస్తరించి వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రపంచంలో ఐదుగురు ఐటి నిపుణులుంటే అందులో నలుగురు భారతదేశానికి చెందినవారని, అయితే ఆ నలుగురిలో ఒకరు తెలుగువారని సిఎం చెప్పారు. టెక్నాలజీవల్ల నాలెడ్జ్‌ వల్ల సంపద సృష్టి చేయడంతోపాటు జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చన్నారు. పిల్లలకు ఆర్ధికంగా డబ్బును అందించలేకపోయినా బాగా చదివించి సంస్కారం నేర్పించచాలన్నారు. రాష్ట్రానికి చెందిన సత్యనాదెళ్ల, తమిళనాడుకు చెందిన సుందర్‌ పిచా§్‌ులు భారతదేశంనుండి విదేశాల్లో రాణించినవారేనన్నారు.

ప్రపంచంలో ఇజ్రాయిల్‌కు చెందిన యూదులు వివిధ దేశాల్లో వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్ధికంగా బాగా స్థిరపడతారని, అలాంటివారిని తోసిరాజని తెలుగువారు అమెరికాలో డబ్బులు బాగా సంపాదిస్తూ తలసరి ఆదాయంలో ముందున్నారన్నారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో టెక్నాలజీని అనుసంధానించడంతో ఏపినే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. భవిష్యత్తులో స్మార్ట్‌ మొబైల్‌ఫోన్లుతో అన్ని పనులు షాపింగ్‌ నుండి మొబైల్‌ బిల్లు పేమెంట్‌ వరకు టెక్నాలజీతోఓ సులభంగా చేయవచ్చన్నారు. పైసా అవినీతి లేకుండా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అమలు చేస్తున్నామన్నారు. రాబోయే డిసెంబర్‌ నాటికి 700 పౌర సేవలు ఆన్‌లైన్లో తీసుకురాగలుగుతామని, ఇకక్కడ వచ్చే సమస్యలను యాప్‌తో పరిష్కారం చేయగలుగుతామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించి నివాసయోగ్యమైన ప్రాంతంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకృతిసిద్దమైన ఆహారం తీసుకుంటే రోగాలు దరిచేరవని, అనారోగ్య సమస్యలు కూడా రావన్నారు.

భారతదేశంలో సగటు వయస్సు ఇప్పుడు 65-69 సంవత్సరాలుంటే రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలతో 85090 సంవత్సరాలకు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా గడపడానికి జెబిఎన్‌ఎఫ్‌తోడ్పాటు అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాంలో భారతదేశం నుండి ఒక తెలుగు ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గుర్తించి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి ఆహ్వానం అందించారన్నారు. మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, మేయర్‌ కె శ్రీధర్‌, ముడా చైర్మన్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, జడ్‌పి చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, అడ్వైజర్‌ విజ§్‌ుకుమార్‌, స్వచ్ఛాంధ్ర మిషన్‌ డా సిఎల్‌ వెంకట్రావ్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్‌, హార్టీకల్చర్‌ కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమీషనర్‌ మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బి లక్ష్మీకాంతం, జడ్‌బిఎన్‌ఎఫ్‌ రైతులు తదితరులు పాల్గొన్నారు.