ఏపిలో వివిధ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Ap minister suresh
Ap minister suresh

తాడేపల్లి: ఏపిలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాడేపల్లిలో విడుదల చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌ 20 నుండి 24 వరకు నిర్వహించనున్నారు. ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ను మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9న నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/