రేపు ఉదయం ఏపి కేబినెట్‌ సమావేశం

ap cabinet meeting
ap cabinet meeting

అమరావతి: ఏపి రాష్ట్ర మంతరి వర్గం రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశానికి రైతుల నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రులను అడ్డుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారని ఇంటలిజెన్స్ సమాచారం ఉండటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఈ కారణంగానే మందడంలో హఠాత్తుగా నోటీసులు ఇచ్చే ప్రక్రియ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ పోలీసులు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. రైతులు ఒక్కసారిగా అగ్రహావేశాలతో రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయొచ్చని నివేదిక ఉండటం… రైతులు, మహిళలు అధికంగా ఉండటంతో సున్నితమైన సమస్యగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం మరోచోట నిర్వహించుకుంటే మంచిదని సూచించినట్టు తెలుస్తోంది.

అయితే ఎప్పటిలాగే సచివాలయంలోనే కేబినెట్ భేటీ నిర్వహిస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తప్పవని ఇంటలిజెన్స్ పోలీసులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రేపటి కేబినెట్ భేటీ… వెలగపూడిలోని సచివాలయానికి బదులుగా సీఎం జగన్ క్యాంప్ కార్యాలయమైన తాడేపల్లిలోనే నిర్వహిస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/