నేడు ఏపి కేబినెట్ సమావేశం

ప‌లు నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం

అమరావతి: నేడు ఏపి కేబినెట్‌ సమావేశం జరుగనుంది. త్వరలో ఏపిలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సిఎం జగన్‌ నేతృత్వంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏయే శాఖ‌లకు, ఏయే ప‌థ‌కాల‌కు ఎంత కేటాయించాల‌న్న విషయంపై ఇప్ప‌టికే ప్ర‌ణాళిక రూపొందించుకున్న నేప‌థ్యంలో వాటిపై కూడా స‌మాలోచ‌న‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన నిధుల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు రాష్ట్రానికి సంబంధించిన‌ పలు అంశాలపై చర్చిస్తారు. గతంలో తీసుకున్న ప‌లు నిర్ణయాలకు మంత్రివ‌ర్గం‌ ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. అలాగే, విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో ఈ అంశంపై కూడా ఏపి కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/