ప్రారంభమైన ఏపి కేబినెట్‌ సమావేశం

పలు కీలక అంశాలపై చర్చ

AP CM YS Jagan

అమరావతి: సిఎం జగన్‌ అధ్యక్షతన ఏపి కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఏపి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, వైఎస్సార్‌ ఆసరా, సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలతో పాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్‌, గాలేరు, నగరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వంటి వాటిపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే, గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్‌ బ్యాండ్ సేవల అమలు, యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీలకు పోస్టుల మంజూరుపై ఈ మంత్రివర్గ సమావేశంలో‌ ఆమోదం తెలపనున్నారు. అలాగే, ఏపి స్టేట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఆమోద ముద్ర పడనుంది. ఏపి‌కు పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/