ఏపి మంత్రి వర్గం సమావేశం

AP fCabinet
AP Cabinet

అమరావతి: ఏపిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి వర్గం సమావేశం అయ్యింది. సుమారు దాదాపు 45 నిమిషాల పాటు జరగనున్న ఈ భేటీలో 201920 రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించామన్నారు. బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/