కొనసాగుతున్న ఏపి కేబినేట్‌ సమావేశం

ap cabinet meeting
ap cabinet meeting

అమరావతి: ఏపి కేబినేట్‌ సమావేశం సచివాలయంలో జరుతుంది. సిఎం జగన్‌ నేతృత్వంలో సాగుతున్న ఈ సమావేశంలో ముఖ్యంగా సంక్షేమ పథకాల అంశంపై చర్చించనున్నారు. వేర్వేరు కార్డులు జారీపై మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే జనవరి నుంచి కొత్త కార్డుల పంపిణీ, అసైన్డ్‌ భూముల వ్యవహారం, మైనింగ్‌ లీజుల రద్దు వంటి ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అంతేకాకుండా జగనన్న విద్యాదీవెన పథకాన్ని మంత్రివర్గం ఆమోదించనుంది. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/