కొనసాగుతున్న ఏపీ మంత్రవర్గ సమావేశం

అమరావతి : ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్‌ చర్చిస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్‌ ఆసరా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. గృహ నిర్మాణానికి రూ.35వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణాల వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకంపై చర్చిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/