ప్రారంభమైన ఏపి కేబినెట్‌ సమావేశం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ సమీక్షంలో కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులందరు కూడా భేటి అయ్యారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే నవంబర్‌లో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా సమీక్షించనున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా 500 రకాల మందుల పంపిణీ, నవంబర్ 2న వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, పాఠశాలలు నాడునేడు కార్యక్రమం, అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, ఇసుక వారోత్సవాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చలు జరపనున్నారు. వీటితో పాటు గోదావరికృష్ణాపెన్నా అనుసంధానం, వాహనమిత్ర, సచివాలయాల పనితీరు, అమ్మఒడి పథకం విధివిధానాలు, ఉద్యోగాల క్యాలెండర్‌పై కేబినెట్‌లో చర్చించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/