మే 12 న ఏపీ కేబినెట్

ఈ నెల 12 న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్ తొలిసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వతేది ఉ.11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3గం.లకు మార్చారు. ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించి.. బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.