నూతన ఇసుక విధానానికి ఏపి కేబినెట్‌ ఆమోదం

అన్ని ఇసుక రీచులు ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగింత

AP CM YS JAGAN
AP CM YS JAGAN

అమరావతి: సిఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రీచులను అప్పగించాలని తొలుత ఏపి ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ పట్ల మొగ్గు చూపకపోవడంతో… వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అన్ని రీచులను ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తే… రాష్ట్రంలో ఇసుక కష్టాలు తీరే అవకాశం ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/