ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు

అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే:

•9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.
•మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం.
•ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనిర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం.
•విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని యూనివర్శిటీగా మార్చేందుకు ఆమోదం.
•సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోకి కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చాలని నిర్ణయం. విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.
•టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5,990 కోట్ల బ్యాంకు గ్యారెంటీకి గ్రీన్ సిగ్నల్.
•విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ కు ఎకరాకు రూ. 25 లక్షల చెప్పున 81 ఎకరాలను కేటాయించేందుకు అంగీకారం.
•ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరు.
•హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా రూ. 864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరాకు ఆమోదం.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/