ఏపి బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

ap-budget-important-points

అమరావతిః ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమానికే బడ్జెట్ లో పెద్ద పీట వేశారు.

బడ్జెట్ హైలైట్స్:

.రెవెన్యూ వ్యయం – రూ. 2,28,540 కోట్లు
.రెవెన్యూ లోటు – రూ. 22,316 కోట్లు
.మూలధన వ్యయం – రూ. 31,061 కోట్లు
.ద్రవ్య లోటు – రూ. 54,587 కోట్లు
.జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
.జగనన్న విద్యా దీవెనకు – రూ. 2,841.64 కోట్లు
.జగనన్న వసతి దీవెన – రూ. 2,200 కోట్లు
.వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – రూ. 4,020 కోట్లు
.వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక – రూ. 21,434.72 కోట్లు
.వైఎస్‌ఆర్‌ పీఎం బీమా యోజన – రూ. 1,600 కోట్లు
.రైతులకు వడ్డీ లేని రుణాలు – రూ. 500 కోట్లు
.డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు – రూ. 1,000 కోట్లు
.వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర – రూ. 275 కోట్లు
.వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా – రూ. 125 కోట్లు
.జగనన్న చేదోడు – రూ. 350 కోట్లు
.మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ – రూ. 50 కోట్లు
.లా నేస్తం – 17 కోట్లు
.రైతు కుటుంబాలకు పరిహారం – రూ. 20 కోట్లు
.వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం – రూ. 200 కోట్లు
.ఈబీసీ నేస్తం – రూ. 610 కోట్లు
.వైఎస్‌ఆర్‌ ఆసరా – రూ. 6,700 కోట్లు
.వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు – రూ. 200 కోట్లు
.జగనన్న తోడు – రూ. 35 కోట్లు
.వైఎస్‌ఆర్‌ చేయూత – రూ. 5,000 కోట్లు
.అమ్మ ఒడి – రూ. 6,500 కోట్లు
.ధర స్థిరీకరణ నిధి – రూ. 3 వేల కోట్లు
.వ్యవసాయ యాంత్రీకరణకు – 1,212 కోట్లు.