సంక్షేమం, మేనిఫెస్టోలే అజెండాగా ఎపి బడ్జెట్‌

AP Finance Minister Buggan Rajendra nath Reddy
AP Finance Minister Buggan Rajendra nath Reddy

ఎ పి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరా నికిగాను రూ. 2,27,975 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశం లో కులమతాలకు అతీతంగా పేద రిక నిర్మూలన జరగాలన్న జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు బుగ్గన చెప్పారు. గత బడ్జెట్‌ కంటే ఈసారి బడ్జెట్‌ 19 శాతం పెరిగింది. రెవెన్యూ వ్యయం రూ. 1,80,475 కోట్లు కాగా, రెవెన్యూ లోటు అంచనా రూ. 1778 కోట్లు ,ద్రవ్యలోటు అంచనా రూ. 35,220 కోట్లు అని తెలిపారు. జిఎస్టీపిలో రెవెన్యూలోటు 0.17శాతం, మూలధన వ్యయం రూ. 32,294 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అప్పుల చెల్లింపులకు కేటాయించిన మొత్తం రూ. 8994 కోట్లుగా తెలియచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన వైస్సార్‌సిపి ప్రభుత్వం బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి ఎక్కువ కేటాయింపులు జరిపే అవకాశం లేదని వార్తలు వినిపించాయి. తమ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన ప్రజలకు నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమాన్ని అందించడమే ఎపి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకున్నట్టు బడ్జెట్‌లో వివిధ పథకాలకు జరిపిన కేటాయింపు లను బట్టి అర్థమవ్ఞతోంది.ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలకు వైఎస్సార్‌ రైతుభరోసా, వెస్సార్‌ రైతు బీమా అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును పలు పథకాలకు పెట్టారు. అయితే పనిలో పనిగా సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి పేరుతో రెండు పథకాలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. జగనన్న అమ్మఒడి, పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద స్కూలుకు పంపించే పిల్లల తల్లి ఖాతాలో ఏడాదికి రూ. 15వేలు వేస్తామని ఎన్నికల సమయంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. నవరత్నాలు పథకాల్లో ఈ పథకం ముఖ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలలకు పంపే విద్యార్థులతోపాటు ఇంటర్‌ విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింపచేయాలని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న అమ్మఒడి పథకానికి బడ్జెట్‌లో రూ. 6455 కోట్లుకేటాయించింది. దీనివల్ల 43 లక్షల మందికి లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జగనన్న అమ్మఒడి పథకంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి కూడా జగన్మోహన్‌రెడ్డి పేరుపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి జగనన్న విద్యాదీవెన అనే పేరు పెట్టారు. రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతుభరోసా పథకానికి ఎపి ప్రభుత్వం బడ్జెట్లో భారీ నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 64.06 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చేలా రూ. 8,750 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి ఆర్థిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మే నెల చివరి వారంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌కు దయనీయమైన రాష్ట్ర ఆర్థికస్థితి స్వాగతం పలి కింది. అందువల్ల ఈ పథకాన్ని 2020 మే నుంచి పెట్టుబడి పథకం ప్రారంభించాలనుకు న్నారు. కానీ రైతు ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2019, అక్టోబరు 15నుంచి పెట్టుబడి మొత్తాన్ని అందిం చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద మొత్తం65.06 లక్షల రైతుల ప్రయోజనం పొందుతుండగా, వీరిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. సాగు పెట్టుబడి పథకంలో కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదే. ఈ పథకం కింద ఏటా మే నెలలోనే పంట కాలం ప్రారంభానికి రైతులకు రూ. 12,500 పెట్టుబడి మద్దతు ఇస్తాం అని ప్రకటించారు. రైతు లకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణా లను అందించనుంది. దీనికోసం బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటా యించింది. దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయనున్నారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు పంట నష్టపోతున్నారు. ఇలాంటిసమయంలో రైతులకు రక్షణనిచ్చేది పంట బీమా. అయితే పంట పెట్టుబడికే డబ్బులు ఖర్చయిపోవడంతో చాలా మంది రైతులు బీమాను చేయించలేకపోతున్నారు. అలాంటి వారి తరపున రాష్ట్ర ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. వైఎస్సార్‌ పంటల బీమా పథకంగా పిలవబడే ఈ సంక్షేమ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1,163 కోట్లు కేటాయించింది. దీనివల్ల 62.02 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఎపి బడ్జెట్లో పోలవరానికి నిధుల కేటా యింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పోలవరం ప్రస్తావన తీసుకొచ్చారే కానీ నిధులు కేటాయిం పుపై ప్రస్తావన తీసుకురాలేదు. మంత్రి తన ప్రసంగంలో 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. తగిన బడ్జెట్‌ను కేటా యిస్తామన్నారు. కాని నిధులు ఎంత కేటాయిస్తున్నారన్నది స్పష్టత లేదు. అలాగే కృష్ణా,గోదావరి ఆయకట్టలను స్థిరీకరించడం, రాయ లసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ‘హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దార్శనికత అన్నారు. ఆయన కలను సాకారం చేయడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును జూన్‌ 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయడానికి, తగిన బడ్జెట్‌ను అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మానవతా దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునఃపరి ష్కారం, పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలను తీసు కోవడం జరుగుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డంతోపాటుగా రాష్ట్రంలోని సరస్సులు, చెరువ్ఞలను పునరుద్ధరిం చడానికి ఈ ప్రభుత్వం చర్యలను తీసుకుంటుందన్నారు. 2019- 20 సంవత్సరలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 13,139.13 కోట్లబడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే ఇందులో పోలవరం ప్రాజె క్టుకు ఎంత కేటాయించారన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఈ నిధుల్లోనే కొంత కేటాయింపులు చేశారా అన్నది స్పష్టత లేదు. లేకపోతే మొత్తం పోలవరం మినహా మిగిలిన ప్రాజెక్టుల కోసం కేటాయించా రన్నది తెలియాల్సిఉంది. వాస్తవానికి పోలవరం బాధ్యతనుకేంద్రం తీసుకుంది. జాతీయ ప్రాజెక్టు హోదాలో నిధులన్నీ కేంద్రమే కేటా యించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా నిధులు కేటాయించారు. అయితే ప్రాజెక్టు అంచనాలు పెరగగా ఇటీవలే కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించలేదనేది వాదన. కేంద్రం బడ్జెట్‌లో నిధులు ప్రస్తావన లేకపోవడంతో ఎపి ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల గురించి స్పష్టత ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.

  • ప్రభు పులవర్తి