గవర్నర్‌ను కలిసిన ఏపి బిజెపి నేతలు

ప్రభుత్వ విధానంపై ఫిర్యాదు చేసిన కన్నా లక్ష్మీ నారాయణ

Biswabhusan Harichandan
Biswabhusan Harichandan

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు ఇవాళ కలిశారు. రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతలు, నెల్లూరులో రథానికి నిప్పుపెట్టడంపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించలేదని, గోపాల మిత్రకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇతరవాటికి మళ్లిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/