సినీ లవర్స్ కు ..నిర్మాతలకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్

కరోనా దెబ్బకు చిత్రసీమ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే చిత్రసీమకు మళ్లీ సినీ కళ వస్తుంది. కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయిన చిత్రాలన్నీ మూకుమ్మడిగా వస్తున్నాయి. డిసెంబర్ నెల నుండి వరుసగా అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అవుతుండడం సినీ లవర్స్ , అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ సినీ లవర్స్ , నిర్మాతలకు షాక్ ఇచ్చింది.

ఇక ఏపీలో బెనిఫిట్‌ షోలు ఉండబోవని సమాచార శాఖ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షో లకు ప్రత్యేక అనుమతి ఉంటుందని..అది కూడా చారిటీస్ కోసం మాత్రమే అనుమతి ఇస్తామని ఆయన వివరించారు. చట్టం ప్రకారం ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శన లు మాత్రమే చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

ఇప్పటి వరకు థియేటర్ల ఇష్టా ఇష్టాల మీద ఆధార పడి టికెట్ల విక్రయాలు జరిగేవని… బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సినిమా టికెట్ల విక్రయిస్తామని తెలిపారు. సులభతరంగా సినిమా టికెట్ల విక్రయం జరిగేలా ఈ ప్రక్రియ ఉంటుందని… 1100 థియేటర్లలో ఆన్ లైన్ లో విక్రయం చేపడతామని ప్రకటన చేశారు. సినిమా రిలీజ్ ల సమయంలో అధిక ధరలకు టికెట్లు విక్రయం చేయకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని… ఇక నుంచి బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు తయారు చేశామన్నారు. ఇక ఈ ప్రకటన తో హీరోల అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ..సామాన్య ప్రేక్షకులు మాత్రం టికెట్స్ ధర తగ్గడం తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.