34శాతం రిజర్వేషన్ల ప్రభుత్వ ప్రకటనపై ఎపి బిసి సంక్షేమ సంఘం హర్షం

AP BC Welfare Society Association celebrations

గుంటూరు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల 34శాతం అమలుకు చాలా కాలం నుంచి కొనసాగుతున్న గందర గోళ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. గత ప్రభుతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలును 34 శాతం నుంచి 27.5 శాతంకు కుదిస్తూ ఎన్నికలు నిర్వహించాలని సమాయత్తం అయిన పరిస్థితుల్లో సుప్రీం కోర్టు నిర€యాన్ని సాకుగా చూపి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఎపి ప్రభుత్వం కూడ రిజర్వేషన్లు కుదించే ప్రయత్నాన్ని ్గగత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అప్పటి సిఎం , మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని ఆయన గుర్తుచేశారు.. 2013లో సుప్రీం కోర్టు కూడ రిజర్వేషన్‌ అమలు జనగణన ప్రామాణికంగా తీసుకోవాలని 34శాతం బిసిలకు యథావిధిగా అమలు చేసే విచక్షణాధికారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉందని వివరించిందన్నారు.. అప్పట్లో ఎపి బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది వైకె తో మాట్లాడి హైకోర్టు పిటిషన్‌ దాఖలే చేయటం జరిగిందని పేర్కొన్నారు. అయతే అప్పట్లో ప్రభుత్వాలు బిసి జనాభా గణనను ఉద్దేశ్యపూర్వకంగానే సుప్రీం కోర్టుకు అందజేయలేదని అన్నారు..అనంతరం ప్రస్తుత సిఎం జగన్‌కు పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు 13 జిల్లాల కలెక్టర్లకు బిసి సంక్షేమ సంఘం తరపు వినతిపత్రాలను కూడ అందించామన్నారు.. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో జరిగిన మాదిరిగానే యధావిధిగా 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించటం హర్షణీయమన్నారు.. ఈమేరకు రాష్ట్ర సిఎం జగన్మోహనరెడ్డికి సంఘం తరపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ విజయంలో భాగస్వాములైన బిసి సంక్షేమ సంఘం కార్యవర్గానికి , 13 జిల్లాల బిసి సంక్షేమ సంఘం నాయకులకు పలు బిసి కుల సంఘాల నాయకులకు ఎపి బిసి సంక్షేమ సంఘం తరపున ధన్యవాదలు తెలియజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.