బుగ్గన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌

cm jagan, Buggana Rajendranath
cm jagan, Buggana Rajendranath

అమరావతి: ఏపి శాసనసభలో మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో ఆసక్తి నెలకొంది. రూ.2 లక్షల 27 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిసింది. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన, సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/