రాజేంద్రనాథ్ రెడ్డిగారూ.. మీకు హ్యాట్సాఫ్‌

Chandrababu VS Buggana Rajendranath Reddy
Chandrababu VS Buggana Rajendranath Reddy

అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి కియాపై మాటల యుద్ధం నడిచింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న చొరవ కారణంగానే ఆంధ్రప్రదేశ్ కు కియో మోటార్ల పరిశ్రమ వచ్చిందని చెబుతూ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభకు తెలియజేయడాన్ని విపక్షనేత చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపించారు.రాజేంద్రనాథ్ రెడ్డిగారూ… చాలా తెలివైన వాళ్లు మీరు. హ్యాట్సాఫ్. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే, 2009లో రాజశేఖరరెడ్డి చనిపోయారు. ఆయన ఆత్మ వెళ్లింది ఆ సీఈఓ దగ్గరకు. 2016లో మీరు చంద్రబాబునాయుడి దగ్గరకు వెళ్లండి. ఆయన అన్నీ ఇస్తారు. ఇన్సెంటివ్స్ అన్నీ. అన్ని పనులు చేస్తారు…. పెట్టమని ఆయన చెప్పారు. ఆయనొచ్చి పెట్టారు. అదీ మీరు చెప్పే కథ. ఏం చెప్పాల? మీరు ఎంత గొప్పనాయకులంటే, ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. మీకు కంగ్రాచ్యులేషన్స్ఖి అని చంద్రబాబు సెటైర్లు వేశారు.

చంద్రబాబు నన్ను తెలివైన వాడని అన్నారు. అందుకు ధన్యవాదాలు చెప్తున్నా. కానీ తెలివి ఉన్నా లేకున్నా నిజం నిజమే కదా అధ్యక్ష. ఈ లేఖ జూన్ 13, 2019న రాశారు. ఖ2007లో వైఎస్‌ను కలిశాను. కలిసినప్పుడు స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారు నన్ను ప్లాంట్ పెట్టమని రిక్వెస్ట్ చేశారుగ అని లేఖలో కియా సీఈవో పేర్కొన్నారు. మీరు వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా దీవెన కిందే స్వీకరిస్తున్నాం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/

Visit our twitter page 
https://twitter.com/myvaartha