ఏపి అసెంబ్లీలో బుగ్గన, చంద్రబాబుల విమర్శలు

chandrababu--buggan
chandrababu–buggan

అమరావతి: ఏపి అసెంబ్లీలో అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకోవడంపై కీలక చర్చ జరిగింది. గత టిడపి ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. ప్యాకేజీల్లో మార్పులపై ప్రపంచబ్యాంకు అభ్యంతరం చెప్పిందని అన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ కూడా రాసిందన్నారు. అమరావతికి భూములు ఇవ్వనందుకు పంటలను తగుల పెట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టులపై ముందే మాట్లాడుకొని టెండర్లు నిర్వహించినట్లు తెలుస్తోందని దుయ్యబట్టారు.

అయితే బుగ్గన వ్యాఖ్యలకు టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని రాజధాని రైతులు చెబితే దేనికైనా సిద్ధం. గతంలోనూ వైసీపీ నేతలు అమరావతి నిర్మాణానికి అడ్డుపడ్డారు. పంటపొలాలను తగులబెట్టారు.. రైతుల్లో కొందరిని రెచ్చగొట్టారు. రాజధానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకుకు లేఖలు రాశారు. రాజధాని భూసమీరణలో 7వేల ఎకరాల భూమి మిగులుతుంది. ఆ భూమితో అమరావతి ప్రాజెక్ట్‌ పూర్తి చేయగలం. బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి నగరాలు నిర్మిస్తేనే ఏపీకి ఆదాయం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధానిలో భూముల ధరలు పడిపోయాయి. అని బుగ్గనకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/