‘అమ్మఒడి’ పథకానికి రూ.6455 కోట్లు

అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన

B rajendranath reddy
B rajendranath reddy, ap finance minister

అమరావతి: ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455.80 కోట్లు కేటాయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ. 1500 కోట్లు. మధ్యాహ్నం భోజన పథకానికి రూ. 1077 కోట్లు, వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు కింద రూ. 160 కోట్లు, అక్షయపాత్ర ఫౌండేషన్‌ వంటశాలల నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టబోతున్నామని బుగ్గన తెలిపారు. ఏపి విద్యార్దులు రాష్ట్రంలోనే కాకుండా దేశ, అంతర్జాతీయంగా కూడా ఉద్యోగాలు వెళ్లేందుకు వారి సమర్థతను పెంచడమే లక్ష్యంగా దీనిని అమలు చేస్తున్నామన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద అన్ని కులాల విద్యార్ధులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కల్పిస్తామని మంత్రి బుగ్గన వెల్లడించారు. అంతేకాకుండా ఆహారం, ప్రయాణం, హాస్టల్‌, పుస్తకాలు తదితర ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20,000 అందిస్తామన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/