ఏపి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో స్వల్ప మార్పు

cm jagan, Buggana Rajendranath
cm jagan, Buggana Rajendranath

అమరావతి: ఏపి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో స్వల్ప మార్పు జరిగింది. శాసనసభలో మధ్యాహ్నం 12.22 గంటలకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలోనూ మధ్యాహ్నం 12.22 గంటలకు మండలిపక్ష నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాసనమండలిలో ప్రవేశపెడతారు. ఆ వెంటనే మండలిలో పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అతడి సోదరుడి హఠాన్మరణంతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్ట లేకపోతున్నారు. దీంతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రవేశపెట్టానున్నారు.

Andhra Pradesh 15th Legislative Assembly – Day 02
|Watch LIVE on 12-07-2019|


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/