ఏపి అసెంబ్లీ నుండి టిడిపి వాకౌట్‌

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి ఆసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నుండి టిడిపి పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు వాకౌట్‌ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదంటూ టిడిపి మరోసారి నిరసనకు దిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. అసెంబ్లీలో మంగళవారం తొలి సస్పెన్షన్ జరిగింది. సభ నుంచి ముగ్గురు టిడిపి సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/