రాష్ట్ర బడ్జెట్‌పై యనమల పెదవివిరుపు

Y Rama krishnudu
Y Rama krishnudu

అమరావతి: ఏపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై టిడిపి సీనియర్‌ నేత ,మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ, పస తక్కువ వని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి గత ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారని, సుమారు రూ.48 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్దపడ్డారన్నారు. వడ్డీలేని రుణాలపై అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన సర్కారు రూ. 100 కోట్లే కేటాయించారు. జలవనరుల శాఖకు వెయ్యి కోట్లు తగ్గించారు. అన్ని పథకాలకు వైఎస్‌ఆర్‌, జగన్‌ పేర్లేనా, రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా? అని యనమల ప్రశ్నించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/