సీట్ల లొల్లిపై స్పీకర్‌ నిర్ణయమే ఫైనల్‌

Y S Jagan Mohan Reddy
Y S Jagan Mohan Reddy, AP CM


అమరావతి: ఏపి అసెంబ్లీలో ఈ ఉదయం సీట్ల కేటాయింపు వివాదంపై స్పందించిన సియం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..సీట్ల సర్దుబాటు విషయమై ఎవరూ జోక్యం చేసుకోలేదని ,పూర్తిగా రూల్స్‌ ప్రకారమే ఎవరు ఎక్కడ కూర్చోవాలన్న విషయాన్ని తేల్చి, వారికి సీట్లు కేటాయించారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వివాదానికి కారణమైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ప్రస్తావిస్తూ, సభ మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షం పక్కవరుసలోనే ఆయన కూర్చుంటున్నారని, గతంలోనూ ఆయన అక్కడే కూర్చోవడం వల్ల ఆ సీటుపై తెలియకుండానే కొంత వ్యామోహం ఉండిఉండవచ్చని, అదేం అంత తప్పు కాదని అన్నారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లు కూర్చోవాలని స్పీకర్‌ చెప్పింది శ్రీధర్‌ను ఉద్దేశించేనని, అప్పుడు వెంటనే శ్రీధర్‌ మారు మాట్లాడకుండా గుడ్‌ బా§్‌ులా తన సీట్లో తాను కూర్చున్నాడని ప్రశంసించారు. అంతలేనే చంద్రబాబు రియాక్ట్‌ అవుతూ, నిన్నటివరకూ తన పక్కన కూర్చోబెట్టుకున్న అచ్చెన్నాయుడిని, వెనక్కుపంపి, గోరంట్లను పక్కన పెట్టుకుని ,కావాలనే సీట్లు మార్చి గోల చేస్తున్నారని, సభా సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/