నీటి కొరత, విత్తనాల కొరత టిడిపి చలవే

roja
roja

అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నగరి ఎమ్మెల్యె రోజా మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి మాట్లాడారు. అన్నివర్గాలకు న్యాయం జరిగేలా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 2019-20 బడ్జెట్ ను రూపొందించిందని ఆమె తెలిపారు. ఏపీలో నీటి కొరత, విత్తనాల కొరత టిడిపి చేసిన పాపమేనని దుయ్యబట్టారు. జనవరిలోనే విత్తనాలు సేకరించాల్సి ఉండగా, టీడీపీ ప్రభుత్వం వాటిని సేకరించలేదని విమర్శించారు. కానీ సీఎం జగన్ పక్క రాష్ట్రాల నుంచి 3.5 లక్షల టన్నుల విత్తనాలు తీసుకొచ్చి రైతులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలే ఇవ్వనట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/