వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బోత్ససత్యనారాయణ

Botsa Satyanarayana
Botsa Satyanarayana

అమరావతి: ఏపి అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సిఎం జగన్‌ పాదయాత్రలో రైతుల కష్టాలు చేసి చలించారు. మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావించి అమలు చేస్తాం. కౌలు రైతులకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంఅని బొత్స అన్నారు. రైతుకు వడ్డీలేని పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, సున్నా వడ్డీపై పంట రుణాలు ఇవ్వడం రైతులకు పెద్ద ఊరటనిస్తుందని బొత్స అభిప్రాయపడ్డారు. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతున్నందున ప్రకృతి సహాయ నిధిని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు మంత్రి బొత్స వివరించారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.27,946.65 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.


వ్యవసాయ బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలివే..


•రైతులకు విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు కేటాయింపు. ఎరువులు, పురుగు మందులు పూర్తిస్థాయిలో పరీక్షలు
• ఉద్యానవన శాఖకు రూ. 1532 కోట్ఉల కేటాయింపు
• ఆయిల్‌ ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయింపు. ఆయిల్‌ఫాం తోటల సాగు ప్రోత్సాహానికి రూ.65.15 కోట్లు
• ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ.200 కోట్లు
• రైతులకు తుంపర, బిందు సేద్య పథకాల కోసం రూ.1105.66 కోట్లు
• సహకార రంగం అభివృద్ధి కోసం రెవెన్యూ వ్యయం రూ.174.64 కోట్లు
• సహకార రంగం అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ.60 కోట్లు


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/