మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

Home-Minister Sucharitha
Home-Minister Sucharitha


అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో భాగంగా భద్రతపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి మేకతోటి సుచరిత సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సుచరిత అన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు పని చేసే ప్రదేశాల్లో శక్తి బృందాలు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/

Visit our twitter page 
https://twitter.com/myvaartha