అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

Buggana Rajendranath Reddy
Buggana Rajendranath Reddy

అమరావతి: ఏపి ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి కొలువుదీరిన జగన్‌ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్‌.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ నేను సత్యానికి తప్ప దేనికీ లొంగి ఉండను. సత్యం కాక నేను సేవించ వలసిన ఏ దేవుడూ లేడు’’ అంటూ గాంధీజీ చెప్పిన మాటలను ఉటంకించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు. ‘‘ప్రజలు కోరిన పాలన కోసం సీఎం కృషి చేస్తున్నారు. నమ్మకం, విశ్వసనీయతే ప్రాతిపదికగా ప్రజలు తీర్పు ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించేందుకు సీఎం కృషి చేస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని సీఎం జగన్‌ చెప్పారు. మా ప్రభుత్వానికి మేనిఫెస్టోనే ప్రధాన నియమావళిగా ఉంటుంది’’ అని బుగ్గన చెప్పారు.

లెక్కలు ఇవీ..

రెవెన్యూ లోటు – రూ.1,778.52 కోట్లుబడ్జెట్ అంచనా-19.32శాతం పెరుగుదలరెవెన్యూ వ్యయం-20.10శాతం పెరుగుతందని అంచనాకేటాయింపులు ఇవీ…

  • రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.500 కోట్లు
  • విద్యుత్‌ కొనుగోళ్లు ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు చెల్లిస్తోంది
  • ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్లు రుణంగా వచ్చింది
  • సాగునీటి శాఖకు 13,139 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్లు
  • ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/