ఎమ్మెల్యెకు, మంత్రులకు అంటెండెన్స్‌

cm jagan
cm jagan

అమరావతి: సిఎం జగన్‌ అసెంబ్లీ చర్చల్లో పలు విషయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు నుండి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్‌ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి సభ్యుడూ ఏ టైంకి వచ్చారు.. ఏ టైంకి వెళుతున్నారనే అంశంపై దఅష్టి పెట్టాలని చీఫ్‌ విప్‌కి జగన్‌ సూచించారు. ఈ వివరాలతో ప్రతి రోజూ సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు. టిడిపి నేతలు అసెంబ్లీలో చేస్తున్న విమర్శల సమయంలో ఎక్కువ మంది వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండటం లేదని జగన్‌ భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులకి జగన్‌ బాధ్యత అప్పగించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/

Visit our twitter page 
https://twitter.com/myvaartha