అసెంబ్లీలో అక్రమ కట్టడాలపై చర్చ

CM Jagan , Chandrababu
CM Jagan , Chandrababu

అమరావతి: ఏపి అసెంబ్లీలో అక్రమ కట్టడాలపై చర్చ జరుగుతుంది. సిఎం జగన్‌ కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడంపై అసెంబ్లీలో వివరించారు. రివర్‌ కన్జర్వేటివ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఇచ్చిన నోటీసును అసెంబ్లీలోని టీవీ స్క్రీన్‌పై సిఎం జగన్‌ చూపిస్తూ దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే అలా చేయడంతో మిగిలిన వాళ్లు కూడా అక్రమ కట్టడాలు నిర్మించారని, నదీ పరివాహక ప్రాంతంలో అలా చేస్తే వరదలు సంభవించే ప్రమాదం ఉందని సీఎం జగన్ చెప్పారు. అందుకే నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం జరుగుతోందని వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/