చెయ్యి పైకి ఎత్తిన మీ మనసు కరగలేదు

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ వైఖరి వినిపించే సందర్భంలో తనను, తమ పార్టీని విమర్శించారని చంద్రబాబు స్పీకర్‌తో అన్నారు. అలాంటప్పుడు తమ వాదన చెప్పుకునే అవకాశం కూడా సభలో లేకపోతే బయటకు వెళ్లి చెప్పుకోవాలా అని స్పీకర్‌ను చంద్రబాబు నిలదీశారు. ఆ అవకాశం కల్పించని పక్షంలో, ఇంక అసెంబ్లీకి ఎందుకు రావడం అని ఆయన ప్రశ్నించారు.

మీ అటెన్షన్ కోసం పదేపదే వేలు చెయ్యి నొప్పి పెట్టే విధంగా పైకి ఎత్తుతున్నామని.. కానీ మీ మనసు మాత్రం కరగలేదుగ అని స్పీకర్‌తో చంద్రబాబు అన్నారు. తమ వైపు చూడటమే మానేస్తున్నారని స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు చమత్కరించారు. అయితే.. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై స్పీకర్ కూడా నవ్వుతూ బదులిచ్చారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మీరటు చూస్తే అందంగా కనబడతారని అన్నారని, అందుకే అటు చూస్తున్నానని స్పీకర్ అనడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు నవ్వుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటు చూస్తే ఏమంటారో అని భయపడి చూడటం మానేశారేమోనని అనుకుంటున్నామని అన్నారు. తనను భయపెట్టే వారు ఈ సభలో ఎవరూ లేరని, ఉన్నా తాను భయపడనని స్పీకర్ తమ్మినేని.. చంద్రబాబుకు బదులిచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/

Visit our twitter page 
https://twitter.com/myvaartha