వైఎస్సార్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విగ్రహాల తొలగింపుపై జరిగిన చర్చలో చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె అంబటి రాంబ ఆబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని.. విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజవేఖర్‌రెడ్డి విగ్రహం ఉందన్నారు.

రోజూ చంద్రబాబు వెళుతుంటే ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక దానిని తొలగించిన మహానుభావుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఖఖరాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే రూమ్‌లో ఉండే వాళ్ళం. జగన్‌కు మా స్నేహం తెలియక పోవచ్చు. 77 83… మా ఇద్దరినీ చూసిన వారికి తెలుస్తుంది. మా మధ్య రాజకీయ విరోధం ఉందే తప్ప, వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశంలోకి వచ్చాను. వైఎస్సార్‌ కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాడాం తప్ప, వ్యక్తిగతంగా కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు.


తాజా బిజినెనస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/