వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్నావారికి ఆరోగ్యశ్రీ!

buggana rajendranath reddy
buggana rajendranath reddy

అమరావతి: ఏపి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇందులో ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించనుంది. మధ్యతరగతి కుంటుంబాలకు దీన్ని వర్తింపజేయనున్నామని ఆయన తెలిపారు. దివంగత వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవల విస్తరణను ప్రస్తావించారు. ఈ పథకాలు అనేక రాష్ట్రాలు అనుసరించాయని బుగ్గన చెప్పారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, గిరిజన ఆరోగ్యం, కిడ్నీ రోగులకు సంబంధించి బడ్జెట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఆరోగ్యశ్రీకి పూర్వ రూపు తీసుకొస్తామని బుగ్గన తెలిపారు. పేద వారికే పరిమితమైన ఈ పథకాన్ని మధ్యతరగతి వారికీ వర్తించేలా  రూ.5లక్షలలోపు కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికీ వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఖర్చలు రూ.వెయ్యి మించిన అన్ని కేసులనూ ఈ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితీ లేకుండా అన్ని కేసులకూ చికిత్స అందిస్తామని వివరించారు. 
 సరిహద్దు జిల్లాల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాల్లోని మంచి ఆస్పత్రులను ఈ పథకం జాబితాలో చేరుస్తామని తెలిపారు. అన్ని రోగాలు, సర్జరీలను దీని కింద తీసుకొస్తున్నట్లు చెప్పారు.
 మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని, మొత్తంగా ఈ పథకం కోసం రూ.1740 కోట్లుకేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/