సిఎం జగన్‌కు హుందాతనం ఉండాలి

Acche Naidu
Acche Naidu

అమరావతి: శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మీడియా పాయింట్‌ వద్ద వచ్చి మాట్లాడతు రుణమాపీ కింద మూడు విడతలుగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీ చేయలేదని అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అచ్చెన్నాయుడు తెలిపారు. తమ హయాంలో ప్రజలకు ఏం చేశామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పదేపదే అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్‌కు కూడా బుద్ధి పెరగాలని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు కూడా హుందాతనం ఉండాలని హితబోధ చేశారు. రూ. 15 వేల కోట్ల రుణాలు ఇస్తే రూ.600 కోట్లని చెబుతున్నారని, అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బు చెల్లించామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/