ఏపి అసెంబ్లీ సోమవారానికి వాయిదా

AP Assembly
AP Assembly

అమరావతి: ఏపి అసెంబ్లీలో ఈరోజు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ హఠాన్మరణం చెందడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. దీంతో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యానారాయణ ప్రవేశపెట్టారు.

నేటితో ఈ బడ్జెట్ పద్దులు ముగిశాయి. ఈ రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సోమవారం రోజున ఈ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు మాట్లాడనున్నాయి. ప్రతిపక్షాల లేవనెత్తే విషయాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/