ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాలు

కొద్దిసేపు వాయిదా

AP assembly
AP assembly

అమరావతి: ఏపి శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంమయ్యాయి.ఇరు సభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటు పలువురి మృతికి సంతాప తీర్మానాలను ఆమోదించారు. వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్‌ ఆయా పదవులకు వన్నె తెచ్చారని సభ్యులు కొనియాడారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, డాక్టర్‌ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్‌, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, మోచర్ల జోహార్‌, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది.

శాసనసభలో సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. కాగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు, నవరత్నాలు, నాడునేడు సహా 30 అంశాల పురోగతిపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/