ఈనెల 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఏపీ శాసన సభా సమావేశాలు ఈనెల 25 వరకు జరుగనున్నాయి. దాదాపు 13 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ చాంబర్‌లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశాల నిర్వాహణపై ఇరుపార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రేపు( మంగళవారం) దివంగత మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డికి ఉభ‌య స‌భ‌లు సంతాప తీర్మానంతో సమావేశం ముగుస్తుంది. 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరానికి బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/